23, సెప్టెంబర్ 2012, ఆదివారం

TG STAR-AMRUTH GOUD

amruthgoudచిన్నతనంలోనే సినిమా రంగం మీద కలిగిన ఆసక్తిని పెద్దయ్యాక నిజం చేసుకున్న కళాకారుడాయన. చిన్న చిత్రాల నిర్మాతగా, దర్శకునిగానే కాకుండా అప్పుడప్పుడు నటుడిగాను రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ మెంబర్‌గా గెలవడంతోపాటు త్వరలోనే తెలంగాణ నేపథ్యంలో సినిమా చేస్తానంటున్న కరీంనగర్ ముద్దుబిడ్డ అమృత్‌తో ఈ వారం ‘ఫటాఫట్’.

పూర్తి పేరు?
పులి అమృత్‌గౌడ్.
పుట్టింది?
కరీంనగర్ జిల్లా, కేశవాపూర్ గ్రామం.
కుటుంబ నేపథ్యం?
తండ్రి మల్లయ్యగౌడ్. కల్లుగీత కార్మికుడు, తల్లి అమృత. గృహిణి.
చదువు? 

ఎం.ఎ (సోషియాలజీ), ఎం.సి.జె, డి.ఎఫ్.టెక్ (ఫిల్మ్ టెక్నాలజీ).
మొదటి ఉద్యోగం?
జర్నలిస్టు.
ప్రేమ పెళ్లా? 
పెద్దలు చేసిన పెళ్లి.
భార్య పిల్లలు?
భార్య అనూరాధ, పిల్లలు సాయిదీపిక, సాయి మధుర శ్రీ.
మొదటి సినిమా?
నిర్మాతగా ‘క్షేమం’ చిత్రం.
ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు నిర్మించారు?
8 సినిమాలు, 4 టి.వి. చిత్రాలు, 20 డాక్యుమెంటరీలు.
మీరు నిర్మించిన చిత్రాలు?
‘క్షేమం’, ‘ది స్టూడెంట్స్’, ‘ఈ తీర్పు ఇల్లాలిది’, ‘హెచ్చరిక’, ‘మనుషులు మమతలు’, ‘గాలింపు’, ‘లెనిన్’, ‘ద డిజైర్’ (హిందీ).
దర్శకుడిగా మీకు గుర్తింపు తెచ్చిన చిత్రం?
‘లెనిన్’.

ప్రస్తుతం చేస్తున్న చిత్రం?
‘పరిమళ’ షూటింగ్ జరుగుతోంది.
నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఎలా రాణించగలుగుతున్నారు?
పట్టుదలతో. నటనపై ఆసక్తి లేదు. నా కాన్సంవూటేషనంతా ప్రొడక్షన్, డైరెక్షన్ పైనే.
ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో నటించారు?
‘లెనిన్’, ‘యే ఖూన్ మేరా హై’, ‘ది స్టూడెంట్స్’ చిత్రాలతో పాటు ‘పక్కిల్లు’, ‘స్వయంకృతం’, ‘పల్నాటి నాగమ్మ’, ‘ఉత్సవం’ టి.వి. సీరియల్స్‌లో నటించా.
నటుడిగా అత్యంత గుర్తింపు తెచ్చిన పాత్ర ఏది?
లెనిన్ పాత్ర.
సినిమా నటుల్లో మీకు ఎవరంటే ఇష్టం? 
కమలహాసన్, శ్రీదేవి.
కౌన్సిల్ మెంబర్‌గా మీ భాద్యతలేంటి?
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల సంక్షేమం కోసం సినీరంగంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉంది.
చిన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం?
నా సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో ముందుగానే అంచనా వేసి పరిమిత బడ్జెట్‌లో సినిమా తీస్తాను కనుక.
జీవితంలో మరిచిపోలేని సంఘటన?
ఇంటర్ చదువుతున్న సమయంలో ‘పెద్దయ్యాక సినిమాలు చేస్తానని’ చెప్తే ‘పగటి కలలు కంటున్నావని’ ఎగతాళి చేసిన స్నేహితుడే నా చిత్రం చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం.
సినిమా రంగంలో మీకున్న మంచి మిత్రులు?
చాలామంది నటులు, టెక్నీషియన్లు మిత్రులే.
అవార్డులు ఏమన్నా తీసుకున్నారా?
దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఇదిగో ఇటు చూడండి’ టి.వి. చిత్రానికి ‘యునిసెఫ్’ ప్రశంసాపత్రం, ‘సూర్యచంవూద’ అవార్డు, ‘కళామిత్ర’ పురస్కారం.
సినిమా రంగంలోకి రాకుండా ఉంటే?
జర్నలిస్టుగా కొనసాగేవాణ్ని.
భవిష్యత్తులో తెలంగాణపై చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
ఉంది. స్క్రిఫ్ట్‌వర్క్ జరుగుతోంది.
మీలో మీకు బాగా నచ్చే విషయం? 
ఆత్మవిశ్వాసం.
దేవుడ్ని నమ్ముతరా?
షిర్డి సాయి, సమ్మక్క, సారలమ్మలకు మొక్కుతా.
సినిమా రంగంలోకి రావడానికి కారణం?
ఫిల్మ్ మీడియా చాలా శక్తివంతమైంది. వంద పుస్తకాలతో చెప్పలేనిది ఒక సినిమా ద్వారా చెప్పవచ్చు. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా.
మీకున్న బలహీనత?
కోపం.
కోపం వస్తే ఏం చేస్తారు?
చేతిలో ఏ వస్తువున్నా అంతే సంగతులు.
ఎదుటి వాళ్లలో మీరు కోరుకునేది?
నిజాయితీ.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్లు?
నా క్లాస్‌మెట్ బోడ అశోక్. అతను చిన్ననాడు చెప్పిన సినిమా కథలే నన్ను ఈ రంగానికి రప్పించాయి.

పుస్తకాలు చదువుతారా?
బాగా చదువుతాను.
ఒంటరిగా ఉన్నపుడు ఏం చేస్తరు?
పుస్తకాలు చదవడం, స్క్రిప్టులు రాసుకోవడం, పిల్లలతో ఆడుకోవడం.
ఫ్యూచర్‌లో ఏం కావాలనుంది?
మరిన్ని మంచి సినిమాల దర్శక నిర్మాతగా.
కొత్తవారికి కెమెరామెన్ శిక్షణ కూడా ఇస్తారటగా?
నా స్టూడియోలో 8 ఎం.ఎం, 16 ఎం.ఎం, 35 ఎం.ఎం. కెమెరాలున్నాయి. సినిమారంగం పట్ల ఆసక్తి ఉన్న పేదవారికి సంవత్సరంలో రెండుసార్లు ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం.
చిన్న చిత్రాలకు భవిష్యత్తు ఉందంటారా?
గుత్తాధిపత్యం పోయి ప్రభుత్వం కొన్ని విషయాల్లో సహకారం అందిస్తే తప్పకుండా ఉంటుంది.
నిర్మాణం, దర్శకత్వం, నటనల్లో ఏది సులభం అంటారు?
ఏ శాఖయినా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే.


CURTESY:NAMASTHETELANGAANA.COM

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి